పాదయాత్ర భక్తులకు పండ్ల పంపిణి
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు, హనుమాన్ దీక్షా స్వాములకు మద్నూర్ గ్రామానికి చెందిన సంతోష్ నార్లవర్ తన భక్తి భావాన్ని చాటుకున్నారు. వారు సేద తీరడం కోసం తాజాపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, అల్పాహారం, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసి, స్వయంగా పంపిణీ చేశారు. భక్తులకు సేవ చేయడం భగవంతుడికి సేవ చేయడంతో సమానమని భావించి ఈ కార్యక్రమం చేపట్టారు. రామ లక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్ కి అంటూ నినాదాలు చేస్తూ దూర ప్రాంతాల నుండి వందల సంఖ్యలో భక్తులు సలాబత్తుల ఆంజనేయ స్వామి ఆలయానికి పాదయాత్రగా వచ్చారు. ఈ కార్యక్రమంలో కొండా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
భక్తి భావాన్ని చాటుకున్న సంతోష్ నార్ల వార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



