Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సర్దార్ పాపన్న జయంతి వేడుకలు..

ఘనంగా సర్దార్ పాపన్న జయంతి వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో సోమవారం శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్ 375వ జయంతి వేడుకలు జై గౌడ్ ఉద్యమం జిల్లా ఉపాధ్యక్షుడు పండరి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు విఠల్ గౌడ్ మాట్లాడుతూ. పాపన్న గౌడ్ మహారాజ్ బహుజనుల కోసం పోరాడిన మొట్టమొదటి బహుజన వీరుడని, బహుజన చక్రవర్తి అని తెలిపారు. బహుజన నాయకుడు పాపన్న గోల్కొండ కోట తో పాటు పలుకోటలను జయించి బహుజన రాజ్యం స్థాపించారని తెలిపారు. పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడని, మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడని, గెరిల్ల సైన్యంతో తాటికొండ, వేములకొండలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడని తెలిపారు.

జై గౌడ్ ఉద్యమం జిల్లా ఉపాధ్యక్షుడు పండరి గౌడ్ మాట్లాడుతూ. తాటి కొండలో చెక్ డాం నిర్మించాడని, ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురాబాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లండన్ లో ఉన్న కేంబ్రిడ్జ్ యునివర్సిటీ పాపన్న మహారాజ్ చరిత్రపై అధ్యయం చేయించి సర్ధార్ పాపన్న ముఖ చిత్రంతో రెండు పుస్తకాలలో (ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ది సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్) చరిత్రను ముద్రించిందని తెలిపారు. సర్ధార్ పాపన్న మహారాజ్ శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్,సభ్యులు బాలగౌడ్,రామగౌడ్,నాగగౌడ్, శ్రీనివాస్ గౌడ్,రామగౌడ్,శంకర్ గౌడ్,అంబా గౌడ్, అంబా గౌడ్,అవినాష్ గౌడ్,గంగాగౌడ్, సాయగౌడ్, శ్రీనివాస్ గౌడ్, నవీన్ గౌడ్, భాను గౌడ్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, గౌడ సోదరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad