- Advertisement -
నవతెలంగాణ – చిన్న కోడూరు
నూతన సర్పంచ్ ఇట్టబోయిన శ్రీనివాస్, ఉపసర్పంచ్ కర్నె రవిందర్ రెడ్డి, వార్డు సభ్యులు పిట్ల ప్రేమ్ చందు, తడకమడ్ల శ్రీకాంత్,మిట్టపల్లి సవిత రాంబాబు లను శనివారం మాల కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మనమందరం కలిసి మెలిసి ఒక కుటుంబంలో ఉండి మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కాముని ఉమేష్ చంద్ర, మాల కుల సంఘ సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
- Advertisement -



