- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామ ప్రజల దాహార్తి తీర్చడానికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ చంద్రగిరి అశోక్, ఉప సర్పంచ్ బడితేల కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద కొబ్బరికాయ కొట్టి బోర్ బావి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చంద్రగిరి అశోక్, గాద గట్టయ్య, కాంగ్రెస్ నాయకులు సగ్గెం రమేష్, మూడెత్తుల రమేష్, పోల్ తిరుపతి, రేగటి రాజబాబు, అల్లాడి సురేష్, మంతెన సూర్య కిరణ్, చంద్రగిరి శ్రీకాంత్, పేట దేవేందర్, దొబ్బల రమేష్ పాల్గొన్నారు.
- Advertisement -



