Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీఐ(ఎం) బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంజపెళ్లి నర్సమ్మను గెలిపించాలి

సీపీఐ(ఎం) బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంజపెళ్లి నర్సమ్మను గెలిపించాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
నవతెలంగాణ – నూతనకల్

ప్రశ్నించే గొంతుక ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ఉద్యమ పార్టీ సిపిఐఎం బలపరిచిన అంజలి నరసమ్మకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని చిల్పకుంట్లలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. నర్సమ్మ కుమారులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అనేక ప్రజాసేవలో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. గ్రామ ప్రజలకు ఎటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడిన ఈ గ్రామంలో కానీ హైదరాబాదులో కానీ ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఆర్థికంగా, శారీరకంగా అన్ని రంగాలలో నేనుంటానని అంటూ సహాయం చేసే స్వభావం వారికి ఉన్నదని ఆమే ను గెలిపించుకుంటే వారి సేవ ఇంకా అత్యధికంగా గ్రామ ప్రజలు ఉపయోగించుకోవచ్చని అన్నారు ఆమె గెలుపుతో గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

కూటమి పేరుతో చిత్రాల పొత్తుతో గతంలో అధికారం ఉన్న పార్టీలు ఏకమై ప్రజల పక్షాన పోరాడే అభ్యర్థిని ఓడించడం కోసం ఎన్నో కుట్రలు చేస్తున్నారని గ్రామ ప్రజలు వాటిని గుర్తించి ఏకపక్షంగా ఉంగరం గుర్తుకు ఓటేసి పంచాయతీ ఎన్నికలలో గెలిపించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్ రెడ్డి, పులుసు సత్యం, మండల కమిటీ సభ్యులు బత్తుల తిరుమలేష్, అంజ పెళ్లి లక్ష్మయ్య, తొట్ల అచ్చయ్య, లింగయ్య, బొజ శీను, భక్తుల శ్రీను తొట్ల హరీష్, యల్లవుల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -