- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని తడి ఇప్పర్గా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు కోసం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశ్విని సుదర్శన్ మున్నా ఆ గ్రామంలోని బసవేశ్వర విగ్రహానికి దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె గెలుపు కోసం గ్రామ ప్రజలు అండగా ఉన్నట్లు తెలుస్తోంది. అశ్విని సుదర్శన్ మున్న సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవం అయ్యే అవకాశం కొన్ని గంటల్లోనే కోల్పోయింది. గ్రామ ప్రజలంతా ఏకగ్రీవంగా అశ్విని సుదర్శన్ మున్నాకు ఒప్పుకున్నప్పటికీ కొన్ని గంటల్లోనే ఇతరులు తమ నామినేషన్లు వేయడం ఏకగ్రీవ ఎన్నిక జరగకుండా ఎన్ని కలు అనివార్యం అయ్యాయి. ఏది ఏమైనా అప్పటికి అశ్విని గెలుపు ఖాయమని చర్చలు ప్రజల్లో గ్రామస్తులు వినబడుతున్నాయి.
- Advertisement -



