- Advertisement -
నవతెలంగాణ-జూలూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బానోత్ బద్రి నామినేషన్ ఫీజు కోసం శుక్రవారం భిక్షాటన చేపట్టారు. సేకరించిన డబ్బులతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మండలంలోని దుబ్బతండాకు చెందిన బానోత్ బద్రి, ఆమె భర్త శ్రీను స్థానికుల సహకారంతో పంచాయతీ స్థానానికి పోటీ చేస్తున్నారు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాకర్ల సర్పంచ్ స్థానానికి బరిలో నిలిచిన బద్రి 506 ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు.
- Advertisement -



