Monday, December 1, 2025
E-PAPER
Homeజిల్లాలుసర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరిక

సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరిక

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన చింత వినీల ప్రదీప్ దంపతులు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో చింత వినీల ప్రదీప్ దంపతులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కమ్మర్ పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా చింత వినీల ప్రదీప్ పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ముత్యాల సునీల్ కుమార్ వినీల ప్రదీప్ ను  పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -