- Advertisement -
నవతెలంగాణ-కామారెడ్డి
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండా గ్రామ సర్పంచ్ అభ్యర్థి గోనె శివాని గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. తాను గెలిచిన తర్వాత సంవత్సరంలోపు ప్రధాన రహదారి అయిన సిరిసిల్ల – కామారెడ్డి రోడ్డుకు ఇరువైపులా డ్రయినేజీ నిర్మాణం, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయని పక్షంలో రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని బాండ్‌పేపర్ రాసిచ్చారు.
- Advertisement -



