- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గాల్లో శనివారం ఆ గ్రామంలోని నిరుపేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా దుస్తులను ఆ గ్రామ సర్పంచ్ దిగంబర్ ఆ గ్రామ ఉపసర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ కోసం ప్రజా పాలన ప్రభుత్వం నిరుపేదలకు రంజాన్ తోఫా అందించడం శుభ పరిణామమని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ చేయడం నిరుపేదలు సంతోషం వ్యక్తపరుస్తున్నారని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుపేద ముస్లింలు పాల్గొన్నారు.
- Advertisement -



