Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాలికుంటు వ్యాధి టీకాలను ప్రారంభించిన సర్పంచ్

గాలికుంటు వ్యాధి టీకాలను ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మత్తుర తండా గిరిజన గూడెంలో శనివారం పశువైద్య మండల శాఖ ఆధ్వర్యంలో పశువులకు, జీవాలకు గాలికుంటు వ్యాధి ఉచిత టీకాలు సర్పంచ్ చౌహన్ అనిత మోహన్ పశువులకు టీకా వేసి క్యాంపును ప్రారంభించారని వెటర్నరీ మండల వైద్యుడు పండరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా తాండ సర్పంచ్ అనిత మోహన్ చౌహన్ మాట్లాడుతూ.. గ్రామంలోని పశుసంపద కలిగిన రైతులు ప్రతి ఒక్కరు గాలి కుంటి టీకాలను ఉచితంగా వేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలని సూచించారు. గాలి కుంటు వ్యాధి వ్యాధి లక్షణాలు నోటి ద్వారా సొల్లు కారడం, కాళ్లకు గిట్టల మద్య పుండ్లు ఏర్పడటం, పశువులు అనారోగ్యంగా కనిపించి నేతమేయకపోవడం వంటి లక్షణాలు కనబడతాయని ఇది అంటువ్యాధి అని ముందస్తు చర్యగా రాష్ట్ర ప్రభుత్వం గాలి కుంటి వ్యాధి ఉచిత టీకాలు గ్రామాలలో పశువైద్యశాఖ అధికారులు వచ్చి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ జిపి పాలకవర్గ సభ్యులు వెటర్నరీ వైద్య శాఖ గోపాల మిత్రులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -