Friday, December 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సొంత ఖర్చులతో పారిశుధ్ధ్య పనులు చేయించిన సర్పంచ్

సొంత ఖర్చులతో పారిశుధ్ధ్య పనులు చేయించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని పోతునూరు గ్రామ పంచాయతీ లో మట్టి తొలగించక దుర్వాసన వస్తుండడంతో నూతన సర్పంచ్ గత రెండు రోజులుగా మురుగు కాలువల్లో మట్టి, చెత్తాచెదారం తొలగిస్తున్నారు. గ్రామాల్లో పరిశుభ్రత, ఆరోగ్య నిర్వహణలో చాలా ముఖ్యం, దీని కోసం స్థానిక పంచాయితీలు, మండల పరిషత్ నిధులు వినియోగించి, చెత్త, మురుగు నీటి నిల్వలను తొలగిస్తాయి. కానీ సొంత ఖర్చులతో గ్రామ సర్పంచ్ పెండ్యాల సంతోష్ రావు మురుగు కాసలువల్లో మట్టిని తొలగించేదుకు చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. ఇది ప్రజారోగ్యానికి, పర్యావరణానికి చాలా అవసరం, మురుగు కాలువల్లో మట్టి పేరుకుపోవడం వల్ల నీరు నిలిచిపోయి, దుర్గంధం, దోమలు పెరిగి, రోగాలు వ్యాప్తి చెందుతాయి ఆలా జరుగ కుండా మురుగు కాలువల్లో మట్టిని తొలగించి పరి శుభ్రంగా ఉంచాలన్నదే  ఆయన దృఢ సంకల్పం. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -