Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపూర్ బసవన్న గుడికి దారి ఏర్పాటు చేసిన సర్పంచ్

బస్వాపూర్ బసవన్న గుడికి దారి ఏర్పాటు చేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
బస్వాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ పెద్దల సమక్షంలో బసవన్న మందిరం నుండి చెరువు కట్టపై పెరిగిన ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలను జెసిపి యంత్రం సహాయంతో గ్రామ సర్పంచ్ వాగ్మారే రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో తొలగించారు. బసవన్న దేవునికి పూజలు చేసి కార్యక్రమం గ్రామ సర్పంచ్ ప్రారంభించారు. గత కొన్నేండ్లుగా దారి గుండా ముళ్ళపదులు చెట్ల కంపలు పెరగడంతో భక్తులకు వెళ్లడానికి మార్గం కష్టంగా మారి వెళ్లలేకపోయేవారు. గ్రామస్తుల కోరిక మేరకు భక్తుల సౌకర్యార్థం పనులను శుక్రవారం ప్రారంభించారు.ఈ  కార్యక్రమంలో బస్వాపూర్ సర్పంచ్ వాగ్మారే రమణ సురేష్, ఉప సర్పంచ్, బోర్కర్, అనిల్ కుమార్, వార్డ్ సభ్యులు శివాజీ పటేల్, కాలే వార్ మల్లుగొండ, మొకేడ్ సంగ్రం మాజీ సర్పంచ్ రవి శంకర్ పటేల్, గ్రామ పెద్దలు కింది దొడ్డి బసవరాజ్ పటేల్, శివరాజ్ దేశాయ్, ఆరే. రవికుమార్ పటేల్, సుంకరి అనిల్, అలాందే రాజు, బోర్కర్ భాస్కర్, షేక్ హైదర్, తడుగూరు యాదు గొండ, మేస్త్రీ నాగనాథ్, బోర్కర్ రాములు, అలాందే బసవంతరావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -