Tuesday, December 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ విధులు, బాధ్యతలు ఇలా.!

సర్పంచ్ విధులు, బాధ్యతలు ఇలా.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
త్వరలోనే పంచాయతీ పాలకవర్గాలు కొలువు తీరనున్న తరుణంలో సర్పంచ్ విధులు, బాధ్యతల గురించి తెలుసుకుందాం…గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించడం. గ్రామ పం చాయతీ తీసుకున్న నిర్ణయాలను, తీర్మానా లను అమలు చేయడం. గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి (పంచాయతీ కార్యదర్శి) పనితీరును పర్యవే క్షించడం. గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులు చేపట్టడం, పథకాలను అమలు చేయడం.గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల వినియోగాన్ని, పన్నుల వసూలును పర్యవేక్షించడం, 100శాతం పన్ను వసూలుకు కృషి చేయడం. ప్రభుత్వ అధికారులకు, గ్రామీణ సమాజానికి మధ్య పరిచయ కేంద్రంగా, కీలక నిర్ణయాల రూపకర్తగా వ్యవహరించడం జరుగుతుంది.

ఇతర అధికారాలు..
ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణలో పాత్ర వహించడం.గ్రామాభివృద్ధి అధికారి నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించడం.సభ్యుల అనర్హత లేదా ఖాళీలపై జిల్లా పరిషత్ అధికారులకు తెలియజేయడం. మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా హాజరుకావడం. సర్పంచ్ గ్రామ అభివృద్ధి, పరిపాలనలో కీలకపాత్ర పోషిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -