నవతెలంగాణ – దుబ్బాక
ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఖర్చు చేయాలని, ఆ సేవ వల్ల కలిగే సంతృప్తి మరెందులోనూ లభించదని దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్ షేర్ల కైలాష్ తెలిపారు. బుధవారం అక్బర్ పేట భూంపల్లి మండలం చిన్ననిజాంపేటలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎంఈఓ దోమకొండ అంజయ్య తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇదే గ్రామానికి చెందిన నరేష్, స్వామి సహకారంతో సుమారు 50 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, ఐడీ కార్డులు, బెల్టులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా దాతలు నరేష్, స్వామి లను పీఏసీఎస్ చైర్మన్ కైలాష్, ఎంఈఓ అంజయ్య ప్రత్యేకంగా అభినందించారు. చిట్టాపూర్ కాంప్లెక్స్ హెచ్ఎం నారాయణ, స్కూల్ హెచ్ఎం బెంజరం నర్సింహారెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ శాంత, ఉపాధ్యాయులు దీప పలువురున్నారు.
సేవలోనే సంతృప్తి: పీఏసీఎస్ చైర్మన్ కైలాష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES