ప్రారంభించిన చొప్పకట్లపాలెం సర్పంచ్ కాటేపల్లి అశ్విన
నిరంతరం కొనసాగుతుంది: పల్లా కొండలరావు
ధ్యానం శిక్షణ ఇచ్చిన కట్టమూరి పూర్ణ చందర్ రావ
నవతెలంగాణ – బోనకల్
మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయం లో పల్లెప్రపంచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి సత్సంగమం కార్యక్రమం జరిగింది. ఆ గ్రామ సర్పంచ్ కాటేపల్లి అశ్విని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సత్సంగమం వల్ల గ్రామాభివృద్ధికి సహకారం అందించే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు మాట్లాడుతూ సత్సంగమం అంటే మతపరమైన కార్యక్రమాలు కావన్నారు. ప్రకృతిని ప్రజలను కాపాడుకుందాం అన్న తమ సంస్థ లక్ష్యం మేరకు గ్రామంలో రేపటి తరం వారిలో నైతిక విలువలు పెంపొందించడానికి కృషి చేస్తామని తెలిపారు.
ఖమ్మం పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థ బాధ్యులు కట్టమూరి పూర్ణ చందర్ రావు విద్యార్థులు, గ్రామస్తుల చేత ధ్యానం చేయించారు. ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పెంచుకుంటూ మంచి పౌరులతో మంచి సమాజాన్ని రూపొందించవచ్చన్నారు. పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే ఐదు పనులు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు సభ్యులు కొండేటి అప్పారావు, భక్తాంజనేయ స్వామి ఆలయం చైర్మన్ బొగ్గారపు రామచంద్రయ్య, మలినాధ మహానాగ శివాలయం చైర్మన్ తాళ్లూరి రామారావు, పల్లెప్రపంచం నేత్రనిధి బాధ్యులు చలమల అజెయ్ కుమార్, పూజారి వజ్రాల రాధాకృష్ణ, రచ్చా మధు సూదన్ రావు, కొండేటి ప్రవీణ్, తన్నీరు రత్నాకర్ రావు, తన్నీరు మురళీ , దారెల్లి మురళీకృష్ణ , చామర్తి వెంకటేశ్వర్లు, ఏడునూతల పుండరీ, కొణకంచి ధనమ్మ, వజ్రాల మహాలక్ష్మి, బొగ్గారపు రాజ్యలక్ష్మి, కొండా వరలక్ష్మి, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.



