Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్తపల్లిలో ఘనంగా సావిత్రి భాయి పూలే జయంతి

కొత్తపల్లిలో ఘనంగా సావిత్రి భాయి పూలే జయంతి

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని కొత్తపల్లి గ్రామపంచాయతీలో శనివారం సర్పంచ్ కన్నీరు అరుణ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అరుణ స్వామి మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని నైగామ్ అనే గ్రామంలో 1831లో జన్మించారని తెలిపారు. సావిత్రిబాయి పూలే తన 14వ యేట మహాత్మ జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగిందని, తన భర్త అయినా జ్యోతిరావు పూలే సహాయంతో విద్య బుద్ధులు నేర్చుకొని నాటి స్త్రీ సమాజానికి విద్య ఎంతో అవసరమని భావించిన ఆమె, అణచివేయబడుతున్న దళిత జాతిని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారని అన్నారు. అదేవిధంగా పూలే స్త్రీ ల అభ్యున్నతి కోసం చేసిన సేవలను వారు కొనియాడారు. వీరు గొప్ప సంఘసంస్కర్తగా, కవయిత్రిగా పేరు పొందారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, కారోబార్, పాలక వర్గం, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -