Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి సావిత్రిబాయి ఫూలే

మహిళా అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి సావిత్రిబాయి ఫూలే

- Advertisement -

మల్లు లక్ష్మి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహిళా అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి సావిత్రిబాయి ఫూలే అని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి కొనియాడారు. శనివారం హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో సావిత్రి బాయి ఫూలే 195వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.ఎన్‌.ఆశాలత, నాయకులు కవిత, జ్యోతి, పద్మ, మంజుల తదితరులు సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లు లక్ష్మి మాట్లాడుతూ వైధిక ధర్మాల్లో అంతర్భాగంగా ఉన్న బ్రాహ్మణీయ సంప్రదాయాలు, ధర్మశాస్త్రాలు మహిళలు చదువుకోవటాన్ని నిషేధించాయని తెలిపారు. ఆ కాలంలో స్త్రీలు చదువుకుంటే కుటుంబం, సమాజాం అభివృద్ధి చెందుదాయనీ, వారికి విద్య నేర్పించడంలో సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి అమోఘమని తెలిపారు.

1848లో బాలికల కోసం పుణెలో మొదటి పాఠశాలను ప్రారంభించిన ఆమె స్త్రీ విద్యకు బాటలు వేసిన మార్గదర్శి అని గుర్తుచేశారు. సామాజిక విప్లవకారిణిగా 1873 సెప్టెంబర్‌ 24న సత్యశోధ సామాజిక ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి ఆ సంస్థ ద్వారా మహిళల సాధికారత, సంక్షేమం కోసం కృషి చేశారని చెప్పారు. ఎందరో చరిత్రకారులు ఆమె చేసిన కృషిని గుర్తించారని తెలిపారు. క్షురకులు వితంతువులకు శిరోముండనం చేయొద్దంటూ తిరుగుబాటు చేసేలా వారిని చైతన్యవంతులను చేయటంలో సావిత్రిబాయి ఫూలే ముఖ్య భూమిక పోషించారన్నారు. 1876లో మహారాష్ట్రలో కరువు సంభవించినప్పుడు సావిత్రిబాయి ఫూలే అవిశ్రాంతంగా పని చేసి బాధితులను ఆదుకోవడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సహాయ కార్యక్రమాలు, నిధులను మంజూరు చేయించారని కొనియాడారు. 1896 పుణెలో అంటువ్యాధులు ప్రజలకు సోకిన సయమంలో రోగులకు రాత్రింబవళ్లు సేవ చేసిన ఆదర్శమూర్తి సావిత్రిబాయి ఫూలే అని అన్నారు. ఆమె ఆచరించిన సామాజిక, సాంఘిక పోరాటాలకు పూనుకోవటమే ఆమెకిచ్చే నిజమైన నివాళి అని మల్లు లక్ష్మి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -