Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశూద్ర అతి శూద్రుల సరస్వతి సావిత్రిబాయి

శూద్ర అతి శూద్రుల సరస్వతి సావిత్రిబాయి

- Advertisement -

జాతీయ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ
టీపీఎస్‌కే ఆధ్వర్యంలో సావిత్రిబాయి 195వ జయంతి


నవతెలంగాణ-ముషీరాబాద్‌
మనుస్మృతి చీకట్లు.. పెత్తందారుల ఆధిపత్యం శూద్రులపై కొనసాగుతున్న తరుణంలో చదువు వెలుగులు అందించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే శూద్ర అతిశూద్రుల సరస్వతి అని జాతీయ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ అన్నారు. టీపీఎస్‌కే ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలిచిన మాతృమూర్తి ఫూలే అన్నారు. మహిళలకు జ్ఞానాన్ని పంచి సుజ్ఞానిగా నిలిచిన తల్లి సావిత్రిబాయి అని కొనియాడారు. బహుజనులను కూడదీసి భారతీయులను ఒకటి చేసిన అతి శూద్రుల సరస్వతి సావిత్రిబాయి అని చెప్పారు.

టీపీఎస్‌కే రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జి.రాములు మాట్లాడుతూ.. చదువు ఒక్కటే జీవితాలను మారుస్తుందని, కుటుంబం మారాలంటే స్త్రీలు చదువుకోవాలంటూ సావిత్రిబాయి 1848లో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించినట్టు చెప్పారు. తొలి మహిళా టీచర్‌గా ఆమె ఎన్నో కష్టాలు పడ్డారని, అయినా బెదరకుండా 36 పాఠశాలలను స్థాపించి దేశంలోనే మహిళా అభ్యున్నతికి కృషి చేసిన తొలి మహిళ సావిత్రిబాయి అని అన్నారు. ఈనాడు రాజ్యాంగం అందరికీ చదువు హక్కు కల్పించిందంటే అది ఆమె చేసిన పోరాటం అని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చదువు, జ్ఞానం ఈ దేశ ప్రజల మెదళ్లలో మిగిలినంతకాలం సావిత్రిబాయి త్యాగానికి ఈ దేశం రుణపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి, బాలోత్సవం రాష్ట్ర కార్యదర్శి సోమయ్య, కె.ఇందిర, రజిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -