- Advertisement -
నవతెలంగాణ – నసురుల్లాబాద్
బీర్కూర్ నూతన తహసీల్దార్ గా సవాయి సింగ్ బుదవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్ సాయి భుజంగ రావు బదిలీపై నిజాంసాగర్ వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తహసీల్దార్ సవాయి సింగ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుక, మొరం, భూభారతి, ఇతర సర్టిఫికెట్లు, వివిధ అవసరాల కోసం వచ్చేవారు నేరుగా తనను కలవొచ్చని చెప్పారు. బాధ్యతలను స్వీకరించిన తహసీల్దార్ ను బీర్కూరు మండలం ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి తహసీల్దార్ ను శాలువతో సన్మానించారు. వీరి వెంట నాయబ్ తహసీల్దార్ రవి కుమార్ ఆర్ ఐ విజయ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



