Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు సాయన్న 

ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు సాయన్న 

- Advertisement -

-తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి  శ్రీనివాస్ ముదిరాజ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా 1860 నుంచి 1900 మధ్యకాలంలో చిన్న వయసులో పోరాడి న బహుజన విప్లవ వీరుడు పండుగ సాయన్న అని తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి జనవేని శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దోపిడీకి దౌర్జన్యాలకు గురైన పీడిత బాధిత బహుజన వర్గాల కోసం పోరాడుతూ నిజాం సర్కారును ఎదిరించాడన్నారు. పెత్తందారులకు, దొరలకు, ఆధిపత్య వర్గాలకు ఎదురు తిరిగి పోరాడరాన్నారు. తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరుపొందిన పండుగ సాయన్నను స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాాజీ సర్పంచ్ తోడేటి రమేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్, సుంకరి ప్రదీప్ ముదిరాజ్ ,ఎడల రమేష్ ముదిరాజ్, పోలవేణి మహేష్ ముదిరాజ్, తరాల మహేందర్ ముదిరాజ్, , బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img