Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు

ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు.అనంతరం ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ అత్యంత ధీరునిగా,సాహసవంతునిగా ఎదిగిన సాయన్న చిన్ననాటి నుంచే అన్యాయలను ఎదిరించి, పేదల పక్షాన నిలబడ్డాడని కొనియాడారు. అంతే కాకుండా ప్రజలను దోపిడి చేస్తున్న భూస్వాములకు ఎదురు తిరిగి అక్రమంగా దోచుకున్న ధాన్యాన్ని,ధనాన్ని తన దగ్గర దాచుకోకుండా పేదలకు పంచిన వీరుడని పేర్కొన్నారు. పండుగ సాయన్న కేవలం భౌతిక దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా సామాజిక న్యాయం కోసం, రాజ్యాధికారంలో బీసీలకు న్యాయమైన వాటా కోసం పోరాటం సాగించిన‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img