– క్రీడలతో స్నేహభావం : సీజీఎం మురుగన్
నవతెలంగాణ – హైదరాబాద్
ఆల్ ఇండియా ఎస్బీఐ ఇంటర్ సర్కిల్ కబడ్డి టోర్నమెంట్ 2025-26 హైదరాబాద్‌లో జరుగుతోంది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం ఈ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అధికారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా కార్పొరేట్ సెంటర్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) పొన్నంబలం మురుగన్ విచ్చేశారు. వారితో పాటు జనరల్ మేనేజర్లు రవికుమార్ వర్మ, సతీష్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రియదర్శి పంకజ్, ఏఐఎస్బీఐఎస్‌ఎఫ్ జనరల్ సెక్రెటరీ కె చంద్రశేఖర్, ఎస్బీఐఒఎ హైదరాబాద్ సర్కిల్ ప్రెసిడెంట్ హెచ్ శంకర్, ఎస్బీఐఒఎ హైదరాబాద్ సర్కిల్ జనరల్ సెక్రెటరీ కె ఆంజనేయ ప్రసాద్, ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ కెఎస్ శాండిల్యా, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం సాంస్కృతిక ప్రదర్శనలతో ఉత్సాహంగా మొదలయ్యిందని నిర్వాహకులు తెలిపారు. ఉద్యోగులలో శారీరక దృఢత్వం, జట్టు స్పూర్తి, స్నేహభావాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పొన్నంబలం మురుగన్ పేర్కొన్నారు. క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన క్రీడా స్పూర్తితో ఆడాలని సూచించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి ఫోటో సెషన్ నిర్వహించారు. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ హైదరాబాద్ సర్కిల్ , కోల్‌కతా సర్కిల్ జట్ల మధ్య జరిగింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో కోల్‌కతా జట్టుపై హైదరాబాద్ సర్కిల్ జట్టు ఘన విజయం సాధించింది.
ఘనంగా ఎస్బీఐ ఇంటర్ సర్కిల్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



