నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన, దిగ్గజ ప్రైవేట్ రంగ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా – ఎస్‌బీఐ లైఫ్ – స్మార్ట్ షీల్డ్ ప్లస్ పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఇండివిడ్యువల్, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, సిసలైన రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం. నేటి వినియోగదారుల మారుతున్న అవసరాలను తీర్చే విధంగా ఇది రూపొందించబడింది. భవిష్యత్ అవసరాలకు కూడా అనువుగా ఉండే విధంగా ఎస్‌బీఐ లైఫ్ – స్మార్ట్ షీల్డ్ ప్లస్ అనేది జీవితంలోని వివిధ దశల్లో పెరిగే బాధ్యతలకు తగ్గట్లుగా, సరళంగా, ప్రొటెక్షన్‌ను పెంచుకోగలిగే విధంగా ఈ పాలసీ ఉంటుంది.
దీర్ఘకాలిక భద్రత ప్రణాళికను మరింత అర్థవంతంగా, మరింత అందుబాటులోకి తెచ్చే విధంగా ఎస్‌బీఐ లైఫ్- స్మార్ట్ షీల్డ్ ప్లస్ రూపొందించబడింది. ఇది, లెవెల్ కవర్, ఇన్‌క్రీజింగ్ కవర్, లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్ అనే మూడు ఆప్షన్లలో లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత ప్రస్థానాల్లో మారే అవసరాలకు అనుగుణంగా తమ లైఫ్ కవరేజీని మార్చుకోవడంలో పాలసీదార్లకు ఇవి సహాయకరంగా ఉంటాయి. ఇన్‌క్రీజింగ్ కవర్ బెనిఫిట్ వల్ల సమ్ అష్యూర్డ్ ఏటా 5 శాతం సింపుల్ రేటు చొప్పున పెరుగుతుంది. ఇలా సమ్ అష్యూర్డ్‌లో గరిష్టంగా 200 శాతం వరకు పెరుగుతుంది. లెవెల్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్ ఆప్షన్ అనేది వివాహం, పిల్లల జననం, లేదా ఇంటి కొనుగోలులాంటి కీలక సందర్భాల్లో సమ్ అష్యూర్డ్‌ను, అదనంగా ఎలాంటి మెడికల్ అండర్‌రైటింగ్ అవసరం లేకుండా, పెంచుకునేందుకు పాలసీదార్లకి ఉపయోగపడుతుంది. ఏకమొత్తం లేదా వాయిదాల పద్ధతిలో లేదా రెండింటి మేళవింపుతో డెత్ బెనిఫిట్ పే అవుట్ ఆప్షన్లు కూడా ఉంటాయి.
జీవిత భాగస్వామికి అదనంగా రూ. 25 లక్షలు లేదా పాలసీ తీసుకున్నప్పుడు లైఫ్ అష్యూర్డ్ ఎంచుకున్న సమ్ అష్యూర్డ్‌లో 50 శాతం మొత్తానికి (ఏది తక్కువైతే అది) అదనంగా లైఫ్ కవరేజీనిచ్చేలా బెటర్ హాఫ్ బెనిఫిట్‌లాంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనితో పాలసీదారు కన్నుమూసినా, భాగస్వామికి ఆర్థిక భద్రత కొనసాగుతుంది. ఇలాంటి కేసుల్లో లైఫ్ అష్యూర్డ్ యొక్క డెత్ బెనిఫిట్ చెల్లించబడుతుంది. ఇక తదుపరి ప్రీమియంలేమీ చెల్లించనక్కర్లేకుండా, భాగస్వామికి కవరేజీ ప్రారంభమవుతుంది. 60 ఏళ్లు వచ్చే వరకు కొనసాగుతుంది. ప్రమాదవశాత్తూ మరణం, పాక్షికంగా శాశ్వత వైకల్యంలాంటి వాటికి కవరేజీని పొందేలా ఈ ప్రోడక్టులో ఎస్‌బీఐ లైఫ్-యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్లను కూడా పొందవచ్చు. తద్వారా అనూహ్య పరిస్థితుల్లో సమగ్ర ఆర్థిక భద్రతను పొందవచ్చు.
ప్రోడక్టు గురించి మరింత తెలుసుకునేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి: https://www.sbilife.co.in/en/individual-life-insurance/protection-plans/smart-shield-plus
“దేశంలో గణనీయమైన స్థాయిలో ఆర్థిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక ప్రణాళికలు, భద్రతపై అవగాహన పెరుగుతోంది. కొత్త బాధ్యతలు వచ్చే కొద్దీ, సమగ్రంగాను, పరిస్థితులకు తగ్గట్లు మార్చుకోతగిన విధంగా ఉండే బీమా సొల్యూషన్స్‌ను ప్రజలు కోరుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎస్‌బీఐ లైఫ్ – ‘స్మార్ట్ షీల్డ్ ప్లస్’ రూపొందించబడింది. మైలురాయి ఆధారిత మెరుగుదలలను, జీవిత దశలకు అనుగుణంగా మార్చుకోగలిగే వెసులుబాట్లు అందించడం ద్వారా ఇది సాంప్రదాయ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్టుకు మించిన ప్రయోజనాలను అందిస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం క్రియాశీలకంగా, పూర్తి సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా ప్రజలకు సాధికారత కల్పిస్తుంది. ఆర్థిక భద్రత విషయంలో నిశ్చింతగా ఉంటూ, జీవితంలో ప్రధానమైన తమ ఆకాంక్షలు, కుటుంబాలపై మరింతగా ఫోకస్ పెట్టేలా వ్యక్తులకు తోడ్పాటు ఇవ్వాలనేది ఎస్‌బీఐ లైఫ్ లక్ష్యం. నేడు స్వేచ్ఛగా ఉంటూ రేపటి కోసం కూడా సన్నద్ధంగా ఉండేలా కస్టమర్లకు సహాయపడుతుండటం ద్వారా కేవలం భద్రతే కాకుండా వారి ఆర్థిక ప్రస్థానానికి సైతం దోహదపడాలని మేము నిర్దేశించుకున్నాం” అని ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ Mr. ఎం. ఆనంద్ తెలిపారు.
వందేళ్ల వరకు కవరేజీ ఉండే హోల్ లైఫ్ ఆప్షన్, తక్కువ ప్రీమియంలతో అత్యధిక కవరేజీతో పాటు మహిళలకు కూడా కవరేజీ, బహుళ ప్రీమియం చెల్లింపు వ్యవధులు లాంటి ఫీచర్లతో ఎస్‌బీఐ లైఫ్ – స్మార్ట్ షీల్డ్ ప్లస్ అనేది అన్ని వర్గాల వారు, అన్ని వయస్సుల వారికి అనువైన సమ్మిళిత ప్రొటెక్షన్ సొల్యూషన్‌గా ఉంటుంది.
డాక్యుమెంట్ల బాదరబందీ లేకుండా ఫిజికల్, డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ ప్రోడక్టు లభిస్తుంది.