1,191 ‘హగ్ ఎ లైఫ్’ బ్యాగ్‌లతో రికార్డు స్థాయిలో ఎస్‌బీఐ లైఫ్ రూపొందించిన బ్రెస్ట్ సెల్ఫ్-ఎగ్జామినేషన్ మొజాయిక్‌కి గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కడమనేది క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా అవగాహన పెంపొందించడానికి తోడ్పడనుంది
హైదరాబాద్, అక్టోబర్ 2025: భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బీమా దిగ్గజాల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బ్రెస్ట్ హెల్త్‌ను ప్రతి ఇంటా సాధారణంగా చర్చించుకోతగిన విషయంగా అవగాహన పెంపొందించడం ద్వారా అంతర్జాతీయ వేదికపై GUINNESS WORLD RECORDS® నెలకొల్పింది. 1,191 ‘హగ్ ఆఫ్ లైఫ్’ హాట్ వాటర్ బ్యాగ్‌లను ఉపయోగించి, ‘టేక్ ఎ బ్రెస్ట్ సెల్ఫ్-ఎగ్జామ్ విత్ థాంక్స్-ఎ-డాట్’ (“Take A Breast Self-Exam with Thanks-A-Dot”) లాంటి సందేశాన్ని ప్రదర్శించే అతి పెద్ద మొజాయిక్‌ను రూపొందించింది. ముందస్తుగా క్యాన్సర్ సమస్యను గుర్తించడం, స్వీయ సంరక్షణపై అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేయడంతో పాటు మహిళల ఆరోగ్యమనేది చర్చించుకోతగిన ఓ సర్వసాధారణమైన అంశంగా, దేశీయంగా అవగాహన పెంపొందించేందుకు ఇది తోడ్పడనుంది.
ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ & సీఈవో అమిత్ ఝింగ్రాన్; భారతీయ నటి మరియు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్ మహిమా చౌదరి; ఎస్‌బీఐ లైఫ్ చీఫ్ ఆఫ్ బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ & సీఎస్ఆర్ రవీంద్ర శర్మ; GUINNESS WORLD RECORDS® అఫీషియల్ అడ్జుడికేటర్ స్వప్నిల్ దంగారికర్ (Swapnil Dangarikar)తో పాటు ఇతరత్రా ప్రముఖుల సమక్షంలో ఈ రికార్డ్ కార్యక్రమం నిర్వహించబడింది.
భారతీయ మహిళల్లో క్యాన్సర్‌కి సంబంధించి రొమ్ము క్యాన్సర్ సర్వసాధారణమైనదిగా ఉంటోంది. ప్రతి 4 క్యాన్సర్ కేసుల్లో 1 బ్రెస్ట్ క్యాన్సర్ కేసు ఉంటోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకారం భారత్‌లో 60 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు, చికిత్స అవకాశాలు పరిమితంగానే ఉండే, బతికి బైటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉండే, అడ్వాన్స్‌డ్ దశల్లోనే గుర్తించబడుతున్నాయి. అయితే, ముందుగా గుర్తించగలిగితే 90 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులను నయం చేయవచ్చు. సంస్కృతిపరమైన సందేహాలు, అపోహలు, వ్యక్తిగత సంరక్షణ కన్నా కుటుంబ ఆరోగ్యానికే ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడంలాంటి అంశాలనేవి మహిళలు తమ సొంత ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.
మహిళలు స్వేచ్ఛగా బ్రెస్ట్ హెల్త్ గురించి మాట్లాడేందుకు, తరచుగా స్వీయ పరీక్ష చేసుకోవడాన్ని జీవితంలో భాగంగా మార్చుకునేలా వారిని ప్రోత్సహించేందుకు, తద్వారా ఈ అవరోధాలను తొలగించాలనే లక్ష్యంతో 2019లో ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమం అనేది ప్రారంభించబడింది.
2023లో ఎస్‌బీఐ లైఫ్ ‘హగ్ ఆఫ్ లైఫ్’ హాట్ వాటర్ బ్యాగ్‌ను ప్రవేశపెట్టింది. మహిళలు సెల్ఫ్-బ్రెస్ట్ పరీక్షను సురక్షితంగా, ధీమాగా నిర్వహించుకునేందుకు తోడ్పడేలా ప్రపంచంలోనే తొలిసారిగా రూపొందించిన ఈ బ్యాగ్, త్రీ-డైమెన్షనల్ తునకలతో కూడుకున్నదై ఉంటుంది. నిత్యం ఉపయోగించే ఒక ఆబ్జెక్టును అవగాహన, సాధికారతకు శక్తివంతమైన చిహ్నంగా మార్చేలా ఉద్యోగులు, భాగస్వాములు, వాలంటీర్లను ఈ రికార్డు బ్రేకింగ్ మొజాయిక్ ఒక్క తాటిపైకి తెచ్చింది.
“కుటుంబ సంరక్షణలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, వారు తమ సొంత ఆరోగ్యాన్ని అంతగా పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తుంటారు. ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్-ఎ-డాట్ ద్వారా స్వయంగా బ్రెస్ట్ పరీక్షను నిర్వహించుకునేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. అలాగే, వ్యక్తిగత సంరక్షణ అనేది ఇంటా, బైట స్వేచ్ఛగా చర్చించుకునే అంశంగా మార్చే దిశగా ఒక ఉద్యమాన్ని సృష్టిస్తున్నాం. స్వీయ సంరక్షణ దగ్గర్నుంచే సంక్షేమం మొదలవుతుందనే మా నమ్మకానికి ఇది నిదర్శనం. మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడం దగ్గర్నుంచే మీకు ప్రియమైన వారిని సంరక్షించడం ప్రారంభమవుతుందని, స్వీయ సంరక్షణ అనేది మరింత పెద్ద బాధ్యతని మేము భావిస్తాం. GUINNESS WORLD RECORDS® సాధించడమనేది ఒక మైలురాయి మాత్రమే కాదు, స్వీయ సంరక్షణకు ప్రాధాన్యమిచ్చేలా, స్వయంగా బ్రెస్ట్ పరీక్ష చేసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకునేలా మహిళలను ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడనుంది” అని ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆఫ్ బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ రవీంద్ర శర్మ తెలిపారు.
“ముందస్తుగా గుర్తించాల్సిన ఆవశ్యకతను తెలియజేసే ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఎ డాట్‌తో జట్టు కట్టడం ఎంతో సంతోషకరమైన విషయం. స్వయంగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడిన నాకు, క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం ఎంత ముఖ్యమనేది బాగా తెలుసు. తరచుగా స్వయంగా బ్రెస్ట్ పరీక్షలు నిర్వహించుకోవడం ఆరోగ్య సంరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. దీనిపై మాట్లాడుకోవడం ఇప్పటికీ అరుదుగానే ఉంటున్నప్పటికీ, ఎస్‌బీఐ లైఫ్ యొక్క ‘థాంక్స్ ఎ డాట్’కి GUINNESS WORLD RECORDS® గుర్తింపు రావడమనేది వీటిపై చర్చించుకోవడానికి తోడ్పడగలదు. క్యాన్సర్ గురించి తెలుసుకునేందుకు, తగు చర్య తీసుకునేందుకు, తమకు తాము సాధికారత పొందేందుకు మహిళలకు స్ఫూర్తినివ్వగలదు” అని భారతీయ నటి, బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్ మహిమా చౌదరి తెలిపారు.
ఈ కార్యక్రమం ఎస్‌బీఐ లైఫ్ యొక్క “అప్నే లియే, అప్నోం కే లియే” (మన కోసం, మనవారి కోసం) అనే నినాదాన్ని పునరుద్ఘాటిస్తుంది. కొత్త ఆవిష్కరణలను, అవగాహనను, లక్ష్యాన్ని మేళవించడం ద్వారా స్వీయ బ్రెస్ట్ పరిశీలనను సందేహానికి తావు లేని ఒక అలవాటుగా మార్చాలని, ఆర్థిక సంక్షేమంతో పాటు తమ ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిచ్చేలా మహిళలను ప్రోత్సహించాలని కంపెనీ నిర్దేశించుకుంది.



