Sunday, December 14, 2025
E-PAPER
Homeజాతీయంఎస్‌బీఐ రుణాలు చౌక

ఎస్‌బీఐ రుణాలు చౌక

- Advertisement -

వడ్డీ రేట్లు పావు శాతం తగ్గింపు
న్యూఢిల్లీ
: దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రేపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఎస్‌బీఐ వడ్డీ రేట్లకు కోత విధించింది. అన్నిరకాల రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఎస్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లింక్డ్‌ రేటు (ఈబీ ఎల్‌ఆర్‌) 25 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టనుండటంతో రుణాలపై వడ్డీరేటు 7.90 శాతానికి దిగిరానుంది. ప్రయివేటు బ్యాంక్‌లతో పోల్చితే వేగంగా తమ ఖాతాదారులకు ఈ ప్రయోజనాలను బదిలీ చేయడం విశేషం.

తగ్గించిన వడ్డీరేట్లు డిసెంబర్‌ 15 నుంచి అమలులోకి రానున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. అదే విధంగా బ్యాంక్‌ తన మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని కూడా 5 బేసిస్‌ పాయింట్లు కోత విధించింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ 8.75 శాతం నుంచి 8.70 శాతానికి దిగిరానుంది. ఎస్‌బీఐ నిర్ణయంతో రుణ గ్రహీతలపై ఈఎంఐ చెల్లింపుల భారం కొంత తగ్గనుంది. మరోవైపు 2-3 ఏండ్ల కాలపరిమితి కలిగిన ఫిక్సుడ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి పరిమితం చేయగా.. 444 రోజుల డిపాజిట్‌ రేటును 6.60 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -