- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కస్టమర్లకు ఎస్‌బీఐ షాకిచ్చింది. గృహ రుణాలపై వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. కొత్త రుణ గ్రహీతలకు ఈ పెంపు వర్తిస్తుందని.. ఆగస్టు 1 నుంచే సవరంచిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు ఎస్‌బీఐలో గృహ రుణ రేట్లు 7.50శాతం నుంచి 8.45శాతంగా ఉండగా.. తాజా నిర్ణయంతో ఇది 7.50శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. తక్కువ సిబిల్ స్కోరు ఉండేవారికి ఇకపై అధిక వడ్డీరేట్లకు రుణాలు ఇవ్వనుంది.
- Advertisement -