Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్యాంకు మేనేజర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి..

బ్యాంకు మేనేజర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి..

- Advertisement -

ఎస్సీ, ఎస్టీ కమిషన్ నెంబర్ కి ఫిర్యాదు చేసిన గిరిజన మహిళ..
నవతెలంగాణ – మల్హర్ రావు

మహముత్తారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ క్రాప్ లోని విషయంలో తనను మోసం చేశాడని అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సోమవారం  రామగుండంలో మహ ముత్తారం మండలం సిoగంపల్లి గ్రామానికి చెందిన కొప్పుల చంద్రక్క తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు  లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తాను ఒక మారుమూల ప్రాంతానికి చెందిన ఆదివాసి నిరక్షరాసినని, గత రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తాను వ్యవసాయ  రుణం కొరకు  దరఖాస్తు చేసుకోగా నాకు తెలియకుండా 30/12/2023 న రుణం మంజూరు చేసి బ్యాంకు మేనేజర్ సంతోష్ అతని అనుచరుడు ముక్కర కేశవులు మోసం చేశారని, నా ఖాతా నుండి అదే రోజు ముక్కెరా కేశవులు ఖాతాకు బ్యాంకు మేనేజర్ జమ చేసి పంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

నా డబ్బులు నాకు ఇవ్వాలని బ్యాంకు చెట్టు మూడు నెలలు తిరిగిన ఫలితం లేదని కమిషనన్  వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. తనకు మద్దతుగా ప్రజా సంఘాలు ,నాయకులు శాంతియుతంగా ధర్నా చేస్తే వారిపై కేసు పెట్టించాడని ఆమె తెలిపింది. వారం క్రితం మహా ముత్తారం ఎస్సై కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సమగ్ర విచారణ జరిపించి బ్యాంకు మేనేజర్ సంతోష్ ముక్కెర కేశవులుపై నిరక్ష రాసైన గిరిజన మహిళపై మోసం చేసినందుకు బెదిరించినందుకు ఉద్దేశపూర్వకంగా సతాయించినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కమిషనర్ కు ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు చేసిన వారిలో ప్రజా సంఘాల నాయకులు అజ్మీరా పూల్ సింగ్ నాయక్, మందల రాజిరెడ్డి, పీక కిరణ్, రామగిరి రాజు,బొంకురి మధు, మేడిపల్లి పాపయ్య ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -