‘కథ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ మన్నె కొంత విరామం తరువాత తెరకెక్కించిన చిత్రం ‘ఈషా’. అఖిల్‌రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ హర్రర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీవాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని ఈనెల12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీనివాస్ మన్నె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ”కథ’ చిత్రానికి నాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ చిత్రంలోని ఉత్తమ నటనకు జెనీలియాకు నంది అవార్డు కూడా వచ్చింది. నా వ్యక్తిగత కారణాల వల్ల దర్శకత్వానికి గ్యాప్ వచ్చింది. దామోదర్ ప్రసాద్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన ఇచ్చిన సపోర్ట్‌తో ఈ సినిమా చేశాను.
హర్రర్‌తోపాటు మన జీవితాల్లో ఉన్న చావులు పుట్టుకలు, అండర్ కరెంట్‌లో దైవత్వం, సృష్టి చేసే పనులు ఇలా అన్ని అంశాలు ఉంటాయి. సృష్టి అన్నింటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ చిత్రంలో స్ట్రాంగ్‌గా కంటెంట్ ఉంటుంది. ఈ సినిమాలో అన్ని అంశాలను టచ్‌చేశాం. టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండే సినిమా ఇది. మేకప్, కాస్ట్యూమ్, లైటింగ్, సౌండ్ డిజైనింగ్ అన్నింట్లో కేర్ తీసుకున్నాం. అలాగే సినిమాలో చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. వాంటెడ్‌గా ఉండదు సినిమా చూసి భయపడతారు అంతే. హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్లు కూడా ఈ సినిమా చూడకూడదు. సెన్సారు వాళ్లు చూసి, సినిమా చాలా భయంకరంగా ఉంది. గుడ్ కంటెంట్ అన్నారు. కానీ ఈ కథను, ఆ పాయింట్‌ను అలాగే డీల్ చేయాలి. ఈసినిమా ఓ పక్క అందర్నీ భయపెడుతూనే, మరో పక్క అలరిస్తుంది. ఇటీవల కాలంలో ఈ తరహా సినిమాలు రాలేదు. ఇది కచ్చితంగా నా కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుంది’ అని తెలిపారు.
భయపెడుతుంది.. అలరిస్తుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



