నవతెలంగాణ – పరకాల : ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రూ.8 వేల కోట్ల పైగా స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వాలని, పై చదువుల కోసం కౌన్సిలింగ్ హాజరైనందుకు సర్టిఫికెట్స్ ఇబ్బందులకు గురిచేసే కళాశాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ ,ఎస్ఎఫ్ఐ నాయకులు సురేష్, మహేష్ విజయ్, కళ్యాణి ,సుస్మిత ,అరుణ, ప్రభులత తదితరులు పాల్గొన్నారు.
స్కాలర్షిప్స్.. ఫీజు రీయంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES