నవతెలంగాణ డిచ్ పల్లి
ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవి విరమణ చేసిన మండలంలోని అమృత పూర్ గ్రామానికి చెందిన కూరపాటి కేశవులు తన పుట్టిన రోజు సందర్భంగా స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని 30 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లను బుధవారం అందజేశారు.
కూరపాటి కేశవులు ప్రతి సంవత్సరం 26 జనవరి, 15 ఆగస్ట్ రోజు, తన పుట్టిన రోజున తను పుట్టి పెరిగిన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన వస్తువులను తనకు తోచిన విధంగా అందజేస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. తను పుట్టి పెరిగి ఇంత వాడిని చేసిన ఊరికి తనవంతుగా ఏమైనా చేయాలనే ఆలోచనతో ఇలా చేస్తున్ననని ఆయిన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.