- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని బిష్నా రింగ్ రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 35 మంది విద్యార్థులు గాయపడ్డారు. సాంబాలో పిక్నిక్ ముగించుకుని తిరిగి వస్తుండగా.. మంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించక బస్సు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. వెంటనే పోలీసులు క్షతగాత్రులను జమ్మూ ఎయిమ్స్, జీఎంసీ ఆస్పత్రులకు తరలించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -



