Thursday, February 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఏపీలో పాఠ‌శాల‌ బ‌స్సు బోల్తా..

ఏపీలో పాఠ‌శాల‌ బ‌స్సు బోల్తా..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విజ‌య‌న‌గ‌రం జిల్లా అల‌జంగి వ‌ద్ద సెవెంత్ డే ప్ర‌యివేటు పాఠ‌శాల బ‌స్సు బోల్తా పడింది. దీంతో 22 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన విద్యార్థుల‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. పాఠ‌శాల బ‌స్సులో ఎంత మంది విద్యార్థులు ప్ర‌యాణిస్తున్నారు, బోల్తా ప‌డ‌టానికి గ‌ల కార‌ణాలు వంటి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -