నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బడి-బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తొంటిగా దేవన్న మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాముఖ్యతను, విద్యార్థులు కళాశాలలో చదువుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థుల సంక్షేమమే తమ ధ్యేయంగా సిబ్బంది పని చేస్తున్నారన్నారు.
అన్ని రంగాలలో విద్యార్థులను తీర్చి దిద్ది, వారిని ఉన్నత స్థానంలో నిలబెడతామని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దేవన్న మాట్లాడుతూ విజ్ఞానాన్ని అందించి, ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ బిల్ల రాజేందర్, కళాశాల కామర్స్ హెచ్ఓడి ఏ.మనోజ్ కుమార్ తో పాటు లెక్చరర్లు అంజయ్య, శ్రీకాంత్, రికార్డు అసిస్టెంట్ శ్రీనివాస్, స్థానిక జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మధు కుమార్, వైష్ణవి, వెంకటేశ్వర్లు, గంగాధర్, ఆనంద్ కుమార్, మురళి, సుమిత్ర, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



