Wednesday, January 7, 2026
E-PAPER
Homeకరీంనగర్తెలుగు మహాసభల్లో ‘సైన్స్‌కథలు’ ఆవిష్కరణ

తెలుగు మహాసభల్లో ‘సైన్స్‌కథలు’ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
గుంటూరు జిల్లా అమరావతిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖ బాలసాహితీవేత్త డా. కందేపి రాణీప్రసాద్ రచించిన సైన్స్‌కథలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహాసభలలో జరిగే వచన కవితా సదస్సులో డా.కందేపి రాణిప్రసాద్ పుస్తకం ఆవిష్కరించబడింది. వచన కవితా సదస్సులో ప్రకాశం జిల్లా రచయితలు తేళ్ళ అరుణ, నూనె అంకమ్మ రావు, రామలక్ష్మి, ముద్దు వెంకటలక్ష్మి, పంతుల వెంకటేశ్వర రావులు పాల్గొన్నారు. విద్యార్థులకు సైన్స్‌ను తెలియజేసే కథలను రాణీప్రసాద్ ఈ పుస్తకంలో తెలియజేశారు. డా. రాణీప్రసాద్ ఇప్పటికే పది సైన్స్ పుస్తకాలను ప్రచురించారు సైన్స్ వ్యాసాలు, సైన్స్ పొడుపుకథలు, సైన్స్ గేయాలు, సైన్స్ పాటతలు వంటి ప్రక్రియలతో పాటుగా, ఇప్పుడు సైన్స్ కథల పుస్తకాన్ని రచించారు. విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్గించడానికి, సైన్స్ పట్ల భయం పోవడానికి అనేక రచనలు చేస్తున్న రాణీప్రసాద్ కృషి ప్రశంసనీయం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -