Saturday, August 2, 2025
E-PAPER
Homeజిల్లాలుగడ్డి మందు ప్రభావంతో ఎండిపోయిన సోయను పరిశీలించిన శాస్త్రవేత్తలు

గడ్డి మందు ప్రభావంతో ఎండిపోయిన సోయను పరిశీలించిన శాస్త్రవేత్తలు

- Advertisement -

– పంట నష్టానికి కారణాలను అధికారులకు నివేదిస్తామని వెల్లడి 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ఇటీవల నకిలీ గడ్డి మందు ప్రభావంతో ఎండిపోయిన సోయాబీన్ పంటను జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల బృందం సభ్యులు గురువారం పరిశీలించారు. మండల కేంద్రానికి చెందిన జే.భూమేశ్వర్ ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాపు యజమాని ఇచ్చిన నకిలీ గడ్డి మందు మూలంగా సోయా పంట పూర్తిగా ఎండిపోయిన విషయం తెలిసిందే.నకిలీ గడ్డి మందు పిచికారి మూలంగా ఎండిపోయిన పలువురి రైతుల సోయా పంటను శాస్త్రవేత్తల బృందం సభ్యులు వై.స్వాతి (ఎమ్మెస్సీ ప్లాంట్ పాథోలజీ), పి.స్పందన భట్ (ఎమ్మెస్సీ ఆగ్రోనమీ), దినేష్, ఎన్. సంధ్యాకిషోర్ (ఎమ్మెస్సీ ప్లాంట్ బ్రీడింగ్) క్షేత్రా స్థాయిలో పరిశీలించారు.

అనంతరం స్థానిక రైతు వేదిక భవనంలో నకిలీ గడ్డి మందు పిచికారి వల్ల పంట నష్టపోయిన రైతులతో సమావేశం నిర్వహించారు.గ్రామంలో ఎంత మంది రైతులు, ఎన్ని ఎకరాల సోయా పంటకు నష్టం జరిగిందనే వివరాలను మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీని, వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్ ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రైతులతో శాస్త్రవేత్తలు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టానికి గల కారణాన్ని త్వరలోనే నివేదిక రూపంలో జిల్లా వ్యవసాయ అధికారికి సమర్పిస్తామని శాస్త్రవేత్తల బృందం సభ్యులు రైతులకు తెలిపారు. తమ న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా శాస్త్రవేత్తల బృందం సభ్యులకు రైతులు విన్నవించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -