Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నామినేషన్ పత్రాలను పకడ్బందీగా పరిశీలించండి: సబ్ కలెక్టర్

నామినేషన్ పత్రాలను పకడ్బందీగా పరిశీలించండి: సబ్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
శుక్రవారం మండలంలోని పెద్ద తడుగూర్ నామినేషన్ల కేంద్రాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ.. నామినేషన్ ల సమర్పణకు నేడు ఆఖరి రోజు ఉన్నందున ఆ పత్రాలను పకడ్బందీగా పరిశీలించాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ స్థానాలతో పాటు ప్రతి వార్డులో నామినేషన్ లు వేసేలా పర్యవేక్షించాలని తెలిపారు. అందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల ఎంపీడీవో రాణి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -