Thursday, July 31, 2025
E-PAPER
Homeసినిమాసీట్‌ ఎడ్జ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌..

సీట్‌ ఎడ్జ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌..

- Advertisement -

తెలుగు ప్రేక్షకులకు మంచి క్యాలిటీ కంటెంట్‌ అందిస్తూ ‘ఆహా’ ఓటీటీ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసు కుంది. ‘నెట్‌వర్క్‌’ అనే మరో ఇంటెన్స్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో బుధవారం నుంచి ప్రేక్షకులను అలరించటానికి రెడీ అయ్యింది.
శ్రీకాంత్‌ శ్రీరామ్‌, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్ల మాని, శ్రీనివాస్‌ సాయి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌కు సతీష్‌ చంద్ర నాదెళ్ళ దర్శకత్వం వహించారు. రమ్య సినిమా బ్యానర్‌పై లావణ్య యన్‌ఎస్‌, ఎంజి జంగం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సిరీస్‌పై భారీ అంచనాలను పెంచింది.
ఈ సిరీస్‌ గురించి మేకర్స్‌ మాట్లాడుతూ, ‘థ్రిల్లింగ్‌ స్క్రీన్‌ప్లే, అత్యద్భుత విజువల్స్‌తో మొదటి సన్నివేశం నుంచి చివరిదాకా కట్టిపడేసేలా ఉంటుంది. ఆన్‌ లైన్‌ డిపెండెంట్‌, ఆన్‌లైన్‌ గ్యాంబ్లర్‌, ఆన్‌లైన్‌ డేటింగ్‌, ఆన్లైన్‌ ఇన్ఫ్లూయన్సర్‌.. ఇలా నాలుగు పాత్రలు నెట్‌వర్క్‌ బ్యాక్‌డ్రాప్‌తో సాగుతాయి. వీటి ద్వారా కథలో వచ్చే మలుపులు ప్రేక్షకుల్లో చాలా ఎగ్జైట్‌మెంట్‌ని క్రియేట్‌ చేస్తాయి. మనం డైరెక్షన్స్‌ ఇస్తే పని చేయాల్సిన వస్తువు. మన లైఫ్‌ని డైరెక్ట్‌ చేయకూడదు అనే ఇందులోని డైలాగ్‌ నెట్‌వర్క్‌ కథ డెప్త్‌ను ప్రజెంట్‌ చేస్తోంది. స్టార్‌ కంపోజర్‌ శేఖర్‌ చంద్ర మ్యూజిక్‌ ఈ వెబ్‌ సిరీస్‌కి హైలెట్‌గా ఉండబోతుంది. ఎంగేజింగ్‌ స్క్రీన్‌ప్లే, ఎక్స్‌లెంట్‌ పెర్ఫార్మెన్స్‌, టెక్నికల్‌ బ్రిలియన్స్‌తో ఈ వెబ్‌ సిరీస్‌ ఆడియన్స్‌కి సీట్‌ ఎడ్జ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
తాగుబోతు రమేష్‌, సమ్మెట గాంధీ, జోష్‌ రవి, మీనా కుమారి, ఛత్రపతి శేఖర్‌, శివ (హిట్‌ 2), పద్మంజలి, కల్పలత (పుష్ప తల్లి), జెమినీ సురేష్‌, సిద్ధార్థ మీనన్‌, మహేష్‌ విట్టా, శివాని, మహి, మౌనిక రెడ్డి, జబర్దస్త్‌ ఫణి, చిత్రం శ్రీను, సుమన్‌ సెట్టి తదితరులు ఈ సిరీస్‌లో ప్రధాన తారాగణం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -