నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సమ్మిట్‌కు దేశవిదేశాల నుంచి దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులు, బడా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు గ్లోబల్ సమ్మిట్, మరోవైపు ఐటీ ఉద్యోగులతో నానక్‌రాంగూడ రోడ్డులో ఇరువైపులా సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ సమాచారం మేరకు హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో డైవర్ట్ చేస్తున్నారు. ఈ పరిణామంతో ఆ రూట్లో ఆఫీసులకు వెళ్లే ఐటీ, సాధారణ ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రెండో రోజు గ్లోబల్ సమ్మిట్..నానక్‌రాంగూడలో భారీగా ట్రాఫిక్ జామ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



