నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను చేపట్టింది. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఇండియా బ్లాక్ నేతలతో కలిసి ‘ఓటర్ అధికార్ యాత్ర’ను చేపట్టారు. ఆగస్టు 17 ఆదివారం ప్రారంభించిన ఈ యాత్రలో బీహార్ అసెంబ్లీ ప్రతిపక్షనేత, ఆర్‌జేడీ నేత తేజస్వియాదవ్ పాల్గొన్నారు. ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఇక రెండోరోజు (ఆగస్టు 18) కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర సోమవారానికి ఔరంగబాద్ చేరుకుంది. ఇక్కడ జరిగే బహిరంగ సభలో తేజస్వియాదవ్, రాహుల్‌గాంధీలు ప్రసంగించనున్నారు. అలాగే ఈ యాత్రలో భాగంగా.. బహిరంగ సభ జరగబోయే ముందు.. రాహుల్, తేజస్వియాదవ్‌లు దేవ్ సూర్య మందిర్‌లో ప్రార్థనలు చేశారు.