నవతెలంగాణ-హైదరాబాద్: రేపు బీహార్ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ జరగనుంది.రెండో దఫా 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పోలింగ్ సిబ్బంది కూడా బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. 176 మందిని ఎన్నికల పరిశీలకులుగా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మలి విడతలో మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఎన్నికల బరిలో 1,302 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా… ఇందులో ప్రత్యేకగా 136 మంది మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం.అలాగే గట్టి పోలీస్ బందోబస్త్‌ను కూడా ఏర్పాటు చేసింది.
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుకు రెండో దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈనెల 6న మొదటి విడత పోలింగ్ విజయవంతంగా పూరైంది. రికార్డ్ స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదైంది.దీపావళి, ఛత్ పండుగ కోసం బీహారీయులంతా సొంత గ్రామాలకు రావడంతో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఈనెల 14న ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి.



