- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఆదివారం (రేపు) పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 4,332 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 5 చోట్ల నామినేషన్లు లేకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. 415 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్ స్థానాలతో పాటు 29,903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలను వినియోగిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్ల కోసం ఇవాళ ఆయా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రేపు సండే కాబట్టి ఎలాగో హాలిడేనే.
- Advertisement -



