Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండవ స్పెల్ స్క్రీనింగ్ రాత పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

రెండవ స్పెల్ స్క్రీనింగ్ రాత పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఈ నెల 27 న జరగబోయే గ్రామ పాలనా అధికారి రెండవ స్పెల్ స్క్రీనింగ్  పరీక్ష పై మినీ మీటింగ్ హాల్లో  అధికారులతో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.l భువనగిరి జిల్లా కేంద్రంలోని ( వెన్నెల కాలేజ్ ఆవరణలో గల) భువనగిరి కాలేజీ అఫ్ ఎడ్యుకేషన్, అనంతారం లో ఈ నెల 27వ తేదీన ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష జరగనున్నట్లు తెలిపారు.

జీపీఓటి -2025 నియామకంలో భాగంగా పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏలకు ఆప్షన్ల కింద అవకాశం కల్పించి, వారి నుంచి దరఖాస్తులను కోరడం జరిగిందని,  ఈ పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ప్రభుత్వం చే జారీ చేయబడిన ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు, హాల్ టికెట్ ప్రింట్ తీసుకొని రావాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు  9 గంటల వరకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అన్నారు.

పరీక్షా కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లను పూర్తి  చేయాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తాగునీరు, మూత్రశాలలు, తదితర మౌలిక వసతులను కల్పించాలని, వైద్య సిబ్బంది సరిపడా మందుల తో కేంద్రం వద్ద అందుబాటులో ఉండాలని, ఎక్కడా కూడా మాస్ కాపీయింగ్ కు ఆస్కారం ఇవ్వకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరీక్ష సమయాలలో అదనపు బస్సులు  ఏర్పాటు చేసి సమయానికి వచ్చేలా చూడాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పక్కాగా, ప్రశాంత వాతావరణంలో పరీక్షను జరిపించాలన్నారు.

పరీక్ష కేంద్రంలోకి ఎవరికీ కూడా మొబైల్ ఫోన్ లకు అనుమతి లేదన్నారు. అలాగే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలన్నారు. అదే విధంగా పరీక్ష ప్రశ్న పత్రాలను అత్యంత జాగ్రత్తగా పటిష్ట భద్రత నడుమ పరీక్ష కేంద్రానికి చేరవేయాలని, జవాబు పత్రాలను కూడా నిర్దేశిత ప్రాంతాలకు పంపించాలని సూచించారు. పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రం చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ షాపులు పోలీస్ బందోబస్తుతో మూసి వేయించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలలో అడ్మినిస్ట్రేషన్ అధికారి జగన్మోహన్ ప్రసాద్,సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -