బాల్యాల యవ్వనాల బతుకు మరణించిన
శిలాజాల ఈ రోజిలా
జ్వరంగా తెలవారింది
తరతరాల చీకటి ప్రవాహ సుడిలో
మతాలు దేవుళ్ళు
మహిళా జవజీవాల్తో బతుకుతుంటాయని
ఒక నది సాక్ష్యం చెబుతుంది
శవాల శబ్దాల దుఃఖమై పారి
వందలాది చిద్రిత యోనుల చిత్రమైన
గుండె మీద ఖననం చేసిన కలల
ఎముకల గూళ్ళ నిద్ర లేపుతుంది
అదశ్యమైన నీడల
కడుపులో దాచుకొని
ఎదురుచూసిన తూర్పు తలుపు
తెరుచుకుంటుంది భయంగా
నది ఒడ్డును కూర్చొని వెన్నెల
రాత్రంతా పాలమాటలు పారించేది
తీరం వెంట సంసారం పెట్టిన పొలాలు చెలకలు.
పసిడి పాటలు వినిపించేవి
వందలాది రంగుల సీతాకోకచిలుకలు
గాలిలో ఈ దాల్సిన ఒడ్డున
ఈ ఎముకల పంట భూమికెత్తి
ఏ సుఖ నిద్రలో ఉన్నారో దేవ దళారులు !
ఎవరి సౌఖర్య్రార్థమో
రాజ్యం కండ్లు మూసుకొంటోంది
న్యాయం కండ్లు తెర్చుకోదు
అర్రేరు
భక్తి కబంధ హస్తాల్లో చిక్కి
మంజునాధుడు మెల్లేసుకు తిరిగే
బొక్కలైనార్రా!
మా భరతమాతలు!!
– శ్రీనివాస్ వి.బి.ఎన్, 8985006071
మర్మస్థలి
- Advertisement -
- Advertisement -