Sunday, August 3, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో లౌకిక ప్రజాస్వామ్యశక్తులను గెలిపించాలి

బీహార్‌లో లౌకిక ప్రజాస్వామ్యశక్తులను గెలిపించాలి

- Advertisement -

బీజేపీ-జేడీ(యూ)-ఎన్డీఏ కూటమిని ఓడించాలి : సీపీఐ(ఎం)పొలిట్‌బ్యూరో సభ్యులు డాక్టర్‌ అశోక్‌ ధావలే పిలుపు
పాట్నా:
నవంబర్‌లో జరగనున్న బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీ(యూ)-ఎన్డీఏ కూటమిని ఓడించి, లౌకిక ప్రజాస్వామ్య శక్తులను గెలిపించాలని సీపీఐ(ఎం)పొలిట్‌ బ్యూరో సభ్యులు డాక్టర్‌ అశోక్‌ ధావలే పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ సీపీఐఐ(ఎం) కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నితీశ్‌ సర్కార్‌ వైఫల్యాలను ఐక్యంగా ఎండగట్టాలని అన్నారు. కొత్త అసెంబ్లీలో సీపీఐ(ఎం) స్వతంత్ర బలాన్ని పెంచేలా కార్యకర్తలు నడుం బిగించాలని సూచించారు. ఈ సమావేశంలో బీహార్‌ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ,కేంద్ర కమిటీ సభ్యుడు లాలన్‌ చౌదరి ,పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అవధేష్‌ కుమార్‌తో పాటు భారీగా మహిళా కార్యకర్తలు తరలివచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -