గతంలో తెలంగాణలోనూ అక్రమాలు :టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీహార్‌లో లౌకికవాదుల ఓట్లు తొలగించారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ విమర్సించారు. సోమవారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి అధ్యక్షతన ఓట్ చోరీకి నిరసనగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సర్ పేరుతో బీహార్‌లో ఓట్లు తొలగించారనీ, తెలంగాణలోనూ గతంలో అక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు. సర్‌ను తెలంగాణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తు న్నారని ఆరోపించారు. ఓట్ చోరీతో దేశ భవిష్యత్‌కు, ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, హర్యానాలోనూ ఓట్ చోరీతోనే బీజేపీ గెలిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధ విభాగంలాగా పని చేస్తున్నదని విమర్శించారు. ప్రదాని మోడీ 12 ఏండ్ల పాలనతో సామాన్యులకు ఒరిగిందేమీ లేదనీ, బీహార్ అత్యంత వెనుకబడిన తర్వాత కూడా నితీష్ కుమార్ కు ఓట్లు ఎందుకు వేస్తారని ఆయన ప్రశ్నించారు.
డీసీసీ ప్రక్రియలో తమ సలహాలు, సూచనలను ఏఐసీసీ పెద్దలు తీసుకున్నారనీ, ఎప్పుడైనా పేర్లను ప్రకటించొచ్చని తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ నిజాయితీగా పని చేస్తూ పదవులను త్యాగం చేస్తే, మోడీ పదవులే పరమావధిగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీలో పాత, కొత్తవారినీ అందరిని కలుపుకుని పోతున్నట్టు తెలిపారు. మక్కాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఇప్పటికే ఆయా కుటుంబాలకు సహకరించేందుకు వీలుగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదరు భాను చిబ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఇంచార్జ్ సయ్యద్ ఖాలీద్, టీపీసీసీ ఉపాధ్యక్షులు నీలిమ తదితరులు పాల్గొన్నారు. సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మరణించిన వారికి యూత్ కాంగ్రెస్ నివాళులర్పించింది.
బీహార్‌లో లౌకికవాదుల ఓట్ల తొలగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



