నవతెలంగాణకమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినీలు రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల పిడి కల్లెడ నగేష్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థినీలు బి.ప్రణవి, ఎన్.శ్రీనిధి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.
ఈ నెల 23 నుండి ఆసిఫాబాద్ జిల్లా గొహటీలో జరగనున్న 71వ రాష్ట్రస్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో జిల్లా జట్టులో బి.ప్రణవి, ఎన్.శ్రీనిధి పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాలల నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఇద్దరు విద్యార్థినిలను మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేర ఆంధ్రయతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES