నవతెలంగాణ -పెద్దవంగర
ఉపాధ్యాయ దినోత్సవం పురస్కారాల్లో భాగంగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా 12 మంది ఎంపికైనట్లు మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అవుతాపురం ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెచ్ఎం పి. కళాధర్, వడ్డెకొత్తపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. రవీందర్ రెడ్డి, పెద్దవంగర ఉన్నత పాఠశాల మాథ్స్ స్కూల్ అసిస్టెంట్ సీహెచ్. రాజలింగం, బొమ్మకల్ ఉన్నత పాఠశాల సోషల్ స్కూల్ అసిస్టెంట్ జి. రమేష్ బాబు, అవుతాపురం ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ డీకె. వెంకటేశ్వర్లు, చిన్నవంగర ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ టి. లక్ష్మయ్య, ఎక్స్ రోడ్డు పెద్దవంగర ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బి. సత్యనారాయణ, రాజామన్ సింగ్ తండా ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ జి. సురేష్, పోచారం ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ కె. బాలరాజు, బొమ్మకల్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ బి. ప్రణతి, కేజీబీవీ హింది సీఆర్టీ కె. సైదమ్మ, సీఆర్పీ వి. సంతోష్ లు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరిని ఈనెల 6వ తేదీన మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో సన్మానించనున్నట్లు ఎంఈవో తెలిపారు.
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES