Wednesday, January 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గీతావిద్యాలయములో స్వపరిపాలన దినోత్సవం..

గీతావిద్యాలయములో స్వపరిపాలన దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ – చండూరు : స్థానిక  గీతావిద్యాలయములో బుధవారం  స్వపరిపాలన దినోత్సవం  విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయుల పాత్రలో  ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా తమ తమ విధులు నిర్వర్తించి విద్యార్థి లోకానికి ఉపాధ్యాయులు అందించే సేవల గొప్పతనం కొనియాడారు.   చిన్నారులను అధికారులుగా, అనధికారులుగా ఉపాధ్యాయులుగా చూసి సంతోషంతో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్ పోలోజు నరసింహ చారి  మాట్లాడుతూ ఒక్కరోజు  ఉపాధ్యాయులుగా మీరు నిర్వర్తించిన విధులు చాలా సంతోషాన్ని ,సంతృప్తిని కలిగించాయని నిజ జీవితంలో మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు విద్యార్థులను ఆశీర్వదించారు. 

గురువులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉన్నదని తమ గురువుల యొక్క గొప్పదనాన్ని పొగడారు. ఒక్కరోజు ముఖ్యమంత్రిగా  పెండెం రాజు ,డిప్యూటీ సీఎం గా గండూరి చరణ్, బోడ కృష్ణవేణి, హోం మినిస్టర్ గా సంగెపు అక్షయ,  విద్యాశాఖ మంత్రిగా తేలుకుంట్ల లహరి, ఆర్థిక శాఖ మంత్రిగా మట్టపల్లి గణేష్, క్రీడా శాఖ మంత్రిగా  కంబాలపల్లి రాకేష్, ఆరోగ్యశాఖ మంత్రిగా సిలువేరు ఉదయశ్రీ, అడవులు , పర్యావరణ శాఖ మంత్రిగా నాంపల్లి హారిక, రవాణా శాఖ మంత్రిగా గొల్లూరి మనీషా, వ్యవసాయ శాఖ మంత్రిగా గంజన బోయిన హర్షిత, ఐటి శాఖ మంత్రిగా సిద్ధి భవాని శంకర్, నీటి పారుదల శాఖ మంత్రిగా కలిమి కొండ బాలాజీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా వేముల కావేరి, రెవిన్యూ మినిస్టర్ గా జాల నవ్య,  ఫుడ్ కార్పొరేషన్ మినిస్టర్ గా ఇటికాల అంకిత, మునుగోడు ఎమ్మెల్యేగా పసుపులేటి తేజేశ్వర్ ,మెంబర్ అఫ్ పార్లమెంట్  నాంపల్లి రామ్ చరణ్,  అసెంబ్లీ స్పీకర్ గా బొల్లం సుచిత్ర , జిల్లా కలెక్టర్ గా సంకోజు జ్యోత్స్న,   జిల్లా ఎస్పీగా దోటి అంజలి జిల్లా విద్యాశాఖ అధికారిగా మహేశ్వరం మాధురి,  మండల విద్యాధికారిగా బొమ్మరబోయిన నవ్య శ్రీ, పాఠశాల కరస్పాండెంట్ గా పోలోజు శ్రీనిధి  పాఠశాల ప్రిన్సిపల్ గా బుసిగంపల వైష్ణవి , తంగళ్ళపల్లి నందిని తదితర విద్యార్థులు ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు  , పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -