నవతెలంగాణ –పరకాల
స్థానిక పరకాల పట్టణంలోని బిట్స్ పాఠశాలలో ప్రిన్సిపల్ పిండి యుగంధర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా, అధికారులుగా వ్యవహరించి అందరిని అలరించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గా ఎ.వర్షిని, వైస్ ప్రిన్సిపాల్ గా చంద్ర హన్సిక, ఎంఈఓ కావ్య అంజలి, డీఈవోగా మాదాసి అవంతిక తో పాటు ఉపాధ్యాయులుగా మిగతా విద్యార్థులు వ్యవహరించారు.
తదానంతరం బాలల దినోత్సవం వేడుకలలో పాఠశాల ప్రిన్సిపల్ పిండి యుగంధర్, అబ్జర్వర్ శ్రీధర్ ప్రథమ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత విద్యార్థులు ఉపన్యాసాలతో చాచా నెహ్రూ పాటలు, నృత్యాలతో చూపరులను అందరినీ ఆకట్టుకున్నారు. తర్వాత స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా ప్రిన్సిపల్ గా వ్యవహరించిన ఏ వర్షిని మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులకు సమాజాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకువెళ్లడంలో ఉపాధ్యాయుని కృషి అనిర్వచనీయమైందని తెలిపారు.
తర్వాత పాఠశాల ప్రిన్సిపల్ పిండి యుగేందర్ భారత దేశ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బాలల పట్ల చూపిన అపారమైన ప్రేమ, ఆప్యాయతలను గుర్తు చేస్తూ నేటి బాలలే రేపటి పౌరులంటూ సమాజంలో చెడుకు పిల్లలు దూరంగా ఉండాలని అందుకు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలని తెలిపారు నేటి సమాజంలో విద్యార్థులను చెడు మార్గము వైపు ఉసిగొలుపుతున్న మొబైల్ ఫోన్స్ కు దూరంగా విద్యార్థులు ఉండాలని తెలిపారు. తర్వాత స్వయం పరిపాలన దినోత్సవంలో అత్యున్నతమైన ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు, వివిధ క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



